పట్నా : బిహార్‌లో కొందరు నయవంచనకు తెరతీస్తూ చీకటి దందాతో లక్షలు దండుకుంటున్నారు. తమ భాగస్వాముల ద్వారా గర్భం దాల్చని వారిని తల్లిని చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తూ (Job Scam) పలువురి నుంచి పెద్దమొత్తంలో స్కామర్లు దోచుకున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ (బేబీ బర్త్ సర్వీస్) పేరుతో ప్రకటనలు ఇవ్వడం ద్వారా మహిళలకు గర్భం కలిగేలా చేస్తే డబ్బు సంపాదించవచ్చని పురుషులకు టోకరా వేస్తున్నారు.
ఆసక్తి కనబరిచిన వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద నిందితులు రూ. 799 వసూలు చేస్తున్నారు. ఆపై సెక్యూరిటీ మనీ పేరుతో రూ. 5000 నుంచి రూ. 20,000 వరకూ వసూలు చేస్తారు. ఈ స్కామ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మున్నా కుమార్ నివాసంపై దాడుల అనంతరం బిహార్ పోలీసులతో కూడిన సిట్ పలువురు ముఠా సభ్యులను నవాడాలో అరెస్ట్ చేసింది.
ఈ రాకెట్‌కు సంబంధించి ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దేశవ్యాప్తంగా సైబర్ సిండికేట్‌గా ఏర్పడి ఈ దందాకు తెరలేపారని డీఎస్పీ కళ్యాణ్ ఆనంద్ వెల్లడించారు. దాడుల్లో పోలీసులు తొమ్మిది స్మార్ట్ఫోన్లు, ఓ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంటారాగేషన్స్ జరుగుతున్నాయని, త్వరలో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు.
Read More :
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో ఈ నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు.. పోలీసుల హెచ్చరిక