భువనేశ్వర్ : ఒడిషాలోని కొనిషి ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను భగ్నం చేసిన గంజాం పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ 4.56 లక్షలు సీజ్ చేశారు. పోలీసుల బృందం వైట్ కియా సెల్టోస్ కారుపై దాడి చేసి ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను రట్టు చేసిందని స్పాట్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుందని బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ తెలిపారు.
నిందితులను దిపు నహక్, కిటు రౌత్, అశ్వనీ కుమార్ పాత్ర, ప్రశాంత్ కుమార్ సాహు , గోపీనాధ్ మహారాణలుగా గుర్తించామని చెప్పారు. ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్‌కు వీలు కల్పించేలా దీపు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు క్రియేట్ చేస్తుంటాడని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు.
నిందితుల నుంచి పోలీసులు రూ 4.56 లక్షల నగదు, 203 గ్రాముల బంగారం, 9 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ బుకీలు ఆకర్షణీయ ఆఫర్లతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని వారి వలలో పడవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.