నల్లగొండ : ఇన్స్టాగ్రామ్లో ఒక యువతి చేసిన మోసానికి నిండు ప్రాణం బలైంది. నల్లగొండలోని గొల్లగూడలో ఈ ఘోరం వెలుగుచూసింది. ట్రేడింగ్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో యువకుడికి ఒక యువతి వల విసిరింది. అతని వద్ద నుంచి డబ్బు వసూలు చేసింది.
చివరకు తాను మోసపోయానని ఆ యువకుడు అర్థం చేసుకున్నాడు. కానీ అప్పటికే చాలా డబ్బు ఆమెకు అందజేశాడు. దీంతో ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని గోగికర్ చింటు(20)గా పోలీసులు గుర్తించారు.
లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షల రూపాయలు వస్తాయని చింటుకు ఆశచూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతిని నమ్మిన చింటు మోసపోయాడు. బైపాస్ రోడ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.