మణికొండ : ఔటర్ రింగ్‌రోడ్డుపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మంచిరేవుల సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై మొక్కలకు నీళ్లుపోస్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను గచ్చిబౌలి వైపు నుంచి వస్తున్నకారు వెనుకాల నుంచి అతివేగంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జెయింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సయ్యద్ నూర్ హామ్మద్(55) గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. అతివేగంగా, నిర్లక్ష్యంతో వాహనం నడిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు.