భువనేశ్వర్ : భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధ ఉందనే అనుమానంతో ఆమె తల నరికిన వ్యక్తి (55) ఉదంతం ఒడిషాలోనొ దెన్కనల్ జిల్లా చంద్రశేఖర్‌పూర్‌లో వెలుగుచూసింది. అనుమానంతో భార్య తలనరికిన నిందితుడు శరీరం నుంచి వేరుపడిన తలతో 12 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ అవుట్‌పోస్ట్‌కు నడుచుకుంటూ వెళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నకపొడి మాఝీ అలియాస్ జందా భార్య చంచలను అనుమానిస్తూ ఇదే విషయమై పలుమార్లు గొడవపడ్డాడు. రోజూ లాగే గురువారం భార్యతో ఈ విషయంలో ఘర్షణ పడిన మాఝీ ఆవేశంతో పదునైన ఆయుధంతో చంచల తల నరికాడు. మరుసటి రోజు నిందితుడు తెగిపడిన భార్య తలతో గొందియా పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు.
మార్గమధ్యలో గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. భార్య తల నరికి తలతో నిందితుడు నడుచుకుంటూ వెళ్లడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాఝీని అరెస్ట్ చేశారు. నేరంలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులుండగా వారిలో ఒకరికి వివాహమైందని స్ధానికులు తెలిపారు.