అహ్మదాబాద్ : శారీరకంగా కలిసేందుకు నిరాకరించిందనే కోపంతో భార్య(32)ను బెల్టుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఖాకీ ఉదంతం వెలుగుచూసింది. గత నెలలో భర్త తనను తీవ్రంగా వేధించడంతో పాటు ఇంటి నుంచి తరిమివేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పటాన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసే భర్తపై మహిళ ఫిర్యాదు ఆధారంగా గృహ హింస కేసు నమోదైంది.
2012లో తాము పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా నిందితుడితో పరిచయమైందని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. ఆపై తామిద్దరం ప్రేమలో పడి ఆపై వివాహం చేసుకున్నామని తెలిపింది. 2014లో వివాహమైన తర్వాత కచ్‌లో కాపురం పెట్టామని వెల్లడించింది. తాను ఎలాంటి కట్నం తీసుకురాకపోవడంతో అత్తింటి వారు వేధించేవారని తెలిపింది.
పటాన్‌కు భర్త బదిలీ కావడంతో అదే ప్రాంతంలో భర్తతో కలిసి ఉంటోంది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన భర్త కోరిక తీర్చాలని పట్టుబట్టాడని తాను అలిసిపోయానని నిరాకరించడంతో బెల్టుతో విపరీతంగా కొట్టడంతో స్ప్రహ కోల్పోయానని ఆమె తెలిపింది. ఆపై రాత్రంతా తనను ఇంటి బయట నిలబెట్టాడని బలవంతంగా ఇంటి నుంచి గెంటేశాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.