కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 11 ఏండ్ల బాలికపై ఆమె కజిన్ బాయ్‌ప్రెండ్ గురువారం లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాలను కర్రతో గాయపరచడం కలకలం రేపింది. బాధితురాలిని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
బసిర్హాట్ సబ్‌డివిజన్‌లోని చేపల చెరువు వద్ద బాలికను గ్రామస్తులు కాపాడారు. బాలికకు విపరీతంగా రక్తస్రావం కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఉదంతం వెలుగు చూడగానే బాలిక కజిన్ బాయ్‌ఫ్రెండ్‌ను దొంజూర్ జిల్లాలోని హౌరాలో అరెస్ట్ చేవారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియురాలి సోదరిని తన వద్దకు పంపితే కొత్త ఫోన్‌ను కొనివ్వడంతో పాటు డబ్బులు ఇస్తానని నిందితుడు (22)తన గర్ల్‌ఫ్రెండ్‌ను మభ్యపెట్టాడు. ఇక బాధితురాలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం ఆమె మరణించిందనుకుని చేపల చెరువు వద్ద వదిలివేసి వెళ్లానని నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ తెలిపాడని పోలీసులు వెల్లడించారు.