మహబూబ్నగర్ : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను జడ్చర్లలో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీలుసు జడ్చర్లలో తనీఖీలు చేపట్టారు. ఓ ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల 64 వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.