త్వరలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు.. ఓటరు జాబితా రూపకల్పనకు షెడ్యూల్
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు గడువు
- రాష్ట్రవ్యాప్తంగా 334 సహకార సంఘాలు
రాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.. 2013 తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా జరిగాయి. పాలకవర్గాల కాలపరిమితి 2018 ఫిబ్రవరిలో ముగిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 334 వరకు సొసైటీలు ఉండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 29 చేనేత , ఆరు పవర్లూమ్ సొసైటీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. చేనేతతోపాటు మరమగ్గాల సహకార సంఘాలకు సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు బకాయిదారుల జాబితాను సంఘం కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించనున్నారు. ఓటుహక్కు కావాలనుకుంటే సహకార సంఘానికి బకాయిలను ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు. ఏప్రిల్ 15 నుంచి 17వరకు చేనేత జౌళిశాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తారు.
18 నుంచి 25 వరకు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై జాబితా ప్రదర్శిస్తారు. 27 నుంచి 29 వరకు సభ్యుల నుంచి అభ్యంతరాల స్వీకరణ. 30 నుంచి మే 1 వరకు సంఘాల వారీగా జాబితాను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేస్తారు. మే 2 నుంచి 5 వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు. 6 నుంచి 8 వరకు సంఘం నోటీస్ బోర్డుపై సవరించిన జాబితా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12వ తేదీ నాటికి సవరించిన ఓటరు జాబితాను జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు. 13 నుంచి 15 వ తేదీ వరకు రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

