హైదరాబాద్, సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 11మంది సభ్యులతోపాటు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పీ ఫణీంద్రను నియమించారు.
ఈ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రెండేండ్లపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులుగా దొడ్ల అశోక్, కుంబం పద్మ, అడ్డూరి శ్రీధర్‌రావు, బీసుల నర్సయ్య, మంచినీళ్ల దుర్గయ్య, గందెశ్రీ సత్యనారాయణ, సుంకరి సీతయ్య, మోహన్‌శర్మ, జే సీతారాం, కే సత్తయ్య, డీ శ్యామ్‌సుందర్ ఉన్నారు.