![HC grants bail to IIT-Guwahati student accused of rape [Representative image]](https://imgk.timesnownews.com/story/iStock-489544923_1_0.jpg?tr=w-600,h-450,fo-auto)
గువహటి : సహచర విద్యార్ధినిపై లైంగిక దాడి కేసులో నిందితుడైన ఐఐటీ-గువహటి బీటెక్ స్టూడెంట్కు గువహటి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు, నిందితుడు ఉన్నత విద్యావంతులుగా సమాజంలోకి అడుగుపెట్టనున్నారని వారు రాష్ట్రానికి భవిష్యత్ ఆస్తులని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సాక్షులను విచారించిన మీదట నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం లేదని తమ పరిశీలనలో వెల్లడైందని కోర్టు పేర్కొంది.
రూ 30,000 బాండ్, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మార్చి 28 రాత్రి యువతిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు బాలికను కాపాడి వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని ఏప్రిల్ 3న అరెస్ట్ చేశారు.