శనివారం 16 జనవరి 2021
Crime - Sep 18, 2020 , 12:37:49

క‌రోనా పాజిటివ్ అని చెప్పి ప్రియురాలితో స‌ర‌సాలు

క‌రోనా పాజిటివ్ అని చెప్పి ప్రియురాలితో స‌ర‌సాలు

ముంబై : క‌ంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ పేరుతో ఎంద‌రో ఎన్నెన్నో నాట‌కాలు ఆడుతున్నారు. క‌రోనా సోకింద‌ని భార్య‌కు చెప్పి.. ప్రియురాలితో స‌ర‌సాలాడుతున్నాడు ఓ భ‌ర్త ఎట్ట‌కేల‌కు అడ్డంగా దొరికిపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 28 ఏళ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి జులై 24న త‌న భార్య‌కు ఫోన్ చేశాడు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని, బ‌త‌క‌లేన‌ని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారు ప‌డ్డ భార్య త‌న సోద‌రుడి స‌హాయం తీసుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అత‌ని బైక్, హెల్మెట్, బ్యాగు, ఇత‌ర వ‌స్తువులు వ‌శీ సెక్టార్ 17లో ల‌భ్య‌మ‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ తాను ఎక్క‌డ వెళ్లాడు అనేది పోలీసుల‌కు అంతు చిక్క‌లేదు. అయితే అత‌ను భార్య‌కు ఫోన్ చేసిన రోజే.. 100కు రెండుసార్లు డ‌య‌ల్ చేశాడు. ఆ నంబ‌ర్ ఆధారంగా అత‌ని ఫోన్ లోకేష‌న్‌ను గుర్తించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో త‌న ప్రియురాలితో అత‌ను ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అనంత‌రం అత‌న్ని అదుపులోకి తీసుకుని సెప్టెంబ‌ర్ 15న ముంబైకి తీసుకువ‌చ్చారు పోలీసులు. ప్రియురాలితో త‌న భ‌ర్త ఉన్నాడ‌ని తెలిసి భార్య షాక్‌కు గురైంది.