బరాత్‌లో కాల్పులు జరిపిన పెళ్లికుమారుడు.. స్నేహితుడు మృతి
లక్నో : అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్ ఏరియాలో చోటు చేసుకుంది.
మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సమయంలో మనీష్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ పెళ్లికుమారుడు స్నేహితుడు బాబు లాల్ యాదవ్‌కు తగిలింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. వరుడు ఉపయోగించిన తుపాకీ కూడా యాదవ్‌దే.
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు.
दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD
— RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

