న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యాచార ఘటనలు కొనసాగుతున్నాయి. ఊపిరాడకుండా చేయడంతో మరణించిన బాలిక మృతదేహం శుక్రవారం రాత్రి అర్ధనగ్నంగా పడిఉండటం ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లో కలకలం రేపింది. పరారీలో ఉన్న నిందితుడు అమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో అమన్ బాలికకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. ఆపై ఇద్దరి మధ్య ఏం జరిగిందో అమన్ భార్య ప్రియాంక రావత్ తిరిగి ఇంటికి వచ్చేసరికి బాలిక బెడ్‌పై అర్ధనగ్నంగా విగతజీవిగా పడిఉంది. ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్ధలానికి చేరుకునే లోగా అమన్ పరారయ్యాడు.
మృతురాలు నధుపుర ప్రాంతంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. చాలాకాలంగా అమన్‌కు మృతురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఏ పరిస్ధితుల్లో మత్య జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.