చెన్నై : సభ్యసమాజం తలదించుకునేలా కన్నకూతురిపై తండ్రి (47) లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో గురువారం వెలుగుచూసింది. టీనేజ్ బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల వ్యాపారిగా పనిచేసే నిందితుడు రోజూ అతిగా మద్యం సేవించి ఇంటికి వస్తుంటాడు. తాగిన మైకంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చిన నిందితుడు ఒంటరిగా ఉన్న బాలిక(16)ను లైంగికంగా వేధించాడు.
బాలిక గట్టిగా కేకలు వేయడంతో పొరుగింటి వారు అక్కడికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. ఆపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.