ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన బాలిక : తల్లి మందలించడంతో బలవన్మరణం
ఆన్లైన్ గేమ్స్‌లో మునిగితేలుతున్న బాలికను తల్లి మందలించడంతో బాలిక బలవన్మరణానికి పాలపడిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని బల్దేవ్ ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
లక్నో : ఆన్లైన్ గేమ్స్‌లో మునిగితేలుతున్న బాలికను తల్లి మందలించడంతో బాలిక బలవన్మరణానికి పాలపడిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని బల్దేవ్ ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని ఆరవ తరగతి చదివే విద్యార్ధిని (10)గా గుర్తించారు. బాలిక ఇటీవల తండ్రిని కోల్పోడంతో కుటుంబాన్ని పోషించేందుకు తల్లి నీతూ ఇతరుల ఇండ్లలో పనికి కుదిరింది.
చదువుపై ఆసక్తి కనబరచని బాలిక ఎక్కువ సమయం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేది. బాలిక ప్రవర్తతో విసిగిన తల్లి కూతురిని మందలించి ఆపై పనికి వెళ్లింది. పని నుంచి తిరిగివచ్చిన వెంటనే బాలిక విగతజీవిగా పడిఉండటం కనిపించింది. బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్ధలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- ends life
- Girl
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

