e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News తండ్రిపై కోపంతో చిన్నారిని చిదిమేశాడు

తండ్రిపై కోపంతో చిన్నారిని చిదిమేశాడు

తండ్రిపై కోపంతో చిన్నారిని చిదిమేశాడు

అహ్మ‌దాబాద్ : రెండేండ్ల కింద‌ట జ‌రిగిన గొడ‌వ‌ను మ‌న‌సులో పెట్టుకున్న నిందితుడు త‌న ప్ర‌త్య‌ర్ధి కుమార్తె ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డి ఊపిరాడ‌కుండా చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న గుజ‌రాత్ లోని సూర‌త్ లో వెలుగుచూసింది. సూర‌త్ కు స‌మీపంలోని హ‌జీరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత బాలిక తండ్రితో 2019లో నిందితుడు, వల‌స కూలీగా ప‌నిచేసే సాకేత్ కు ఓ విష‌యంలో చిన్న‌పాటి ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో క‌క్ష పెంచుకున్న సాకేత్ ప్ర‌తీకారం తీర్చుకునేందుకు స‌మ‌యం కోసం వేచిచూస్తున్నాడు.

ఈ క్ర‌మంలో బాలిక తండ్రిపై కోపం పెంచుకున్న సాకేత్ ఏప్రిల్ 30న చిన్నారికి డ‌బ్బు, చాక్లెట్ల ఆశ‌చూపి గ‌దిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆపై ఇటుక‌తో ఆమెను గాయ‌ప‌రిచి ఊపిరాడ‌కుండా చేసి ఉసురుతీశాడు. బాలిక ఎంత‌సేప‌టికీ ఇంటికి తిరిగిరాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స్ధానికుల స‌మాచారంతో సాకేత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలిక హ‌త్యోదంతాన్ని నిందితుడి నుంచి రాబ‌ట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కోర్టు ఎదుట హాజ‌రుప‌రిచారు.

Advertisement
తండ్రిపై కోపంతో చిన్నారిని చిదిమేశాడు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement