లక్నో : యూపీలో బాలికలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. సంభాల్‌లో ఆరేండ్ల బాలికపై మసీదులో పనిచేసే ఇమాం లైంగిక దాడికి పాల్పడ్డాడు. మసీదులో పనిచేసే ఇమాం ఓవైస్ తన కూతురిపై బుధవారం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మసీదు సమీపంలోని తన గదిలోకి బాలికను తీసుకువెళ్లిన నిందితుడు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడని జిల్లా ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెడికల్ రిపోర్ట్ అందిన వెంటనే తదుపరి దర్యాప్తు ముమ్మరం చే్తామని చెప్పారు.