రాంచీ : జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. కుంటి జిల్లాలో ఐదేండ్ల బాలికపై బాలుడు (12) లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక కూల్‌డ్రింక్ కొనేందుకు తమ ఇంటి సమీపంలోని షాపుకు వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న బాలుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు.
తోర్పా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరగడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆదివారం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం చేసినట్టు అంగీకరించాడని ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. బాలుడిని రాంచీ జువెనైల్ హోంకు రిమాండ్‌పై తరలించామని చెప్పారు.