మునిపల్లి (సంగారెడ్డి) : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు.. మునిపల్లి మండల కేంద్రంలో సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులు పలువురి ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.