చిచ్చురేపిన భూవివాదం: దళిత కుటుంబంలో నలుగురి హత్య..బాలికపై సామూహిక లైంగిక దాడి!

లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంలో దళిత కుటుంబానికి చెందిన యజమాని (50), ఆయన భార్య (47), కుమార్తె (17), కొడుకు(10)ని నిందితులు పొట్టనపెట్టుకున్నారు.
బాధితులను గురువారం ఉదయం వారి ఇంటిలో విగతజీవులుగా పడిఉండటం బంధువులు గుర్తించారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి 11 మంది నిందితుల్లో 8 మందిని ఇప్పటివరకూ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. గొడ్డళ్లను ఉపయోగించి నిందితులు వీరిని దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాల వద్ద గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని అలహాబాద్ డీఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠి వెల్లడించారు.
భూవివాదం నేపధ్యంలో అగ్రవర్ణాలకు చెందిన కుటుంబం గతంలోనూ తమను పరుషపదజాలంతో దూషించి, వేధింపులకు గురిచేసిందని బాధిత కుటుంబసభ్యుల బంధువులు తెలిపారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

