అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాద ధాటికి జీపు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్ట్గా వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.