
జైపూర్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. వీధి కుక్కపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కోట పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆడ కుక్కపై ఒకతను లైంగిదాడికి పాల్పడుతుండగా.. ఓ సిటిజన్ చూసి షాక్కు గురయ్యాడు. దీంతో అతను పెటా ( People for the Ethical Treatment of Animals ) ప్రతినిధులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జంతువులపై క్రూరంగా ప్రవర్తించే మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పెటా ప్రతినిధి కబీర్ భాను దాస్ డిమాండ్ చేశారు. జంతువులపై లైంగిదాడికి పాల్పడటం నేరమని అని ఆయన అన్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించి, భారీగా జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు.