అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరు బాలురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా (Bapatla District) కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఆదివారం అర్ధరాత్రి లారీ, కారు (Car and Lorry) ఢీకొన్నాయి.
ఈ ఘటనలో కారులో ఉన్న కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు, బేతాలం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాస రాజు మృతి చెందారు. ఇద్దరు బాలురు గాయపడ్డారు. కారులో ఉన్న వారంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడు సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.