బేగంపేట్ : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ కలాసీగూడకు చెందిన దారుపల్లి సాయికుమార్ (42) కు భార్య పిల్లలున్నారు. సాయికుమార్ యేడాది క్రితం వరకు రియో హోటల్లో కార్మికుడిగా పని చేసేవాడు.
కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. దీంతో ఇటు కుటుంబ సమస్యలు, పెరిగిన అప్పులతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసులు సాయికుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.