వికారాబాద్ : పరిగి పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ దొంగ బాబా నిర్వాకం బయటపడింది. మంచి జరుగుతుందంటూ అశ్విని(18) అనే అమ్మాయి చేతులను నిప్పులపై పెట్టించాడు బాబా. దీంతో బాధితురాలి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అశ్విని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశ్విని ఆరోగ్య పరిస్థితిని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. నకిలీ బాబా రఫీని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు రఫీపై ఆరోపణలు ఉన్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి రూ. లక్షలు దండుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.