హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. పేలుడు ధాటికి అక్కడికక్కడే మృతి మృతి చెందింది. అయితే, పేలుడుకు గల కారణాలు, మృతురాలి వివరాలు తెలియరాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.