శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 14:46:55

ఈడీ విచారణకు హాజరైన సుశాంత్‌ మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ

ఈడీ విచారణకు హాజరైన సుశాంత్‌ మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ శుక్రవారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ అయినట్లు ఆయన తండ్రి ఫిర్యాదు చేయడంతో పాట్నాలో కేసు నమోదైంది. సుశాంత్‌ మరణం కేసును బీహార్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఈడీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సుశాంత్‌ స్నేహితురాలైన నటి రియా చక్రవర్తి, మాజీ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీకి ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో వారిద్దరు శుక్రవారం ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. కాగా సుశాంత్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు తన స్టేట్‌మెంట్‌ రికార్డును వాయిదా వేయాలన్న రియా చక్రవర్తి అభ్యర్థనను ఈడీ శుక్రవారం తిరస్కరించింది. దీంతో కార్యాలయానికి వచ్చిన రియాను కూడా ఈడీ ప్రశ్నిస్తున్నది. logo