హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి భారీగా సిగరెట్లతో పాటు ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిగరెట్ల విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఐదుగురిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.