ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి తండ్రి మృతదేహాన్ని దాదాపు 18 నెలలుగా ఫ్రిజ్‌లో దాచాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. తండ్రి మృతదేహాన్ని దాచిన కొడుకు వయసు 82 ఏళ్లు.
ఫ్యామిలీ డాక్టర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో అపార్ట్మెంట్లో పోలీసులు చెక్ చేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు అడగగా.. తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని, మాట్లాడకుండా ఉండలేనని, ఫ్రిజ్‌లో ఉన్న శవంతో రోజూ మాట్లాడుతున్నానని తద్వారా ధైర్యాన్ని పొందుతున్నానని కొడుకు తెలిపాడు.
ఆయన మృతికి సంబంధించి కొడుకుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. ఆయన తండ్రి చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని చుట్టుపక్కల వారు తెలియజేశారు.
కుమారుడి వయసు 82 కావడంతో అతను నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని పోలీసులు తెలిపారు. స్వతహాగా పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. అంతేకాకుండా ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయని, వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామన్నారు.
గతంలోనూ ఇలాంటి సంఘటన 2015లో బయటపడింది. ఓ వ్యక్తి పింఛను కోసం తన తల్లి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు.