చెన్నై : పోలీస్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి తప్పతాగి బస్‌లో తోటి ప్రయాణీకులు, కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కెమెరా కంటపడింది. నగరంలోని వండలూర్-కోయంబేడు మధ్య తిరిగే 70వీ సిటీబస్‌లో ఈ ఘటన జరిగింది. సదరు వ్యక్తి తోటి ప్రయాణీకుడితో ఘర్షణకు దిగగా సర్ధిచెప్పిన వారిపైనా దుర్భాషలాడాడు. సీటులో కూర్చోమని లేదా బస్ దిగి వెళ్లమని చెప్పిన కండక్టర్‌పైనా దాడికి తెగబడ్డాడు.
ఎందరు వారించినా బస్‌లో హంగామా చేస్తున్న వ్యక్తి తీరుతో సహనం కోల్పోయిన ప్రయాణీకులు బలవంతంగా అతడిని బస్ నుంచి దింపివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై చర్యలు చేపడతామని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. కాగా రాత్రివేళ ఫుల్‌గా మద్యం సేవించి వాహనం నడుపుతున్న పోలీసును ప్రయాణీకులు పట్టుకున్న ఘటన ఈ ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలో వెలుగుచూసింది.