చెన్నై : దవాఖానలో పనిచేసే మహిళా ఉద్యోగి కుమార్తె(17)ను లైంగికంగా వేధించిన డాక్టర్‌తో పాటు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరూర్‌లోని జీసీ హాస్పిటల్లో ఆర్దోపెడిక్ డాక్టర్‌గా పనిచేసే డాక్టర్ రజనీకాంత్‌ను ఈ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం అదే దవాఖానలో పనిచేసే మహిళా ఉద్యోగి(37) ఫిర్యాదుపై నిందిఉలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దవాఖానలో పనిచేసే మేనేజర్ శరవణన్ బాలికను డాక్టర్ రజనీకాంత్ వద్దకు తీసుకువెళ్లగా డాక్టర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా డాక్టర్ రజనీకాంత్, శరవణన్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురినీ అరెస్ట్ చేసి కరూర్ జైలుకు 15 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.