ముంబై : తమ ప్రమోషన్‌కు అడ్డుపడ్డాడనే ఆగ్రహంతో సీనియర్‌ను చంపేందుకు ఇద్దరు జూనియర్ ఇంజనీర్లు రూ 20 లక్షల సుపారీ ఇచ్చిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మిరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)కు చెందిన ఇద్దరు జూనియర్ ఇంజనీర్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీపక్ ఖంబిట్ గత కొన్నేండ్లుగా తమకు ప్రమోషన్లు రాకుండా అడ్డుపడుతున్నాడనే కోపంతో జూనియర్ ఇంజనీర్లు యశ్వంత్ దేశ్‌ముఖ్, శ్రీకృష్ణ మోహితెలు దీపక్ హత్యకు కుట్రపన్నారు.
రూ 20 లక్షల సుపారీతో కాంట్రాక్టు కిల్లర్స్‌ను రంగంలోకి దింపారు. సెప్టెంబర్ 29న కిరాయి హంతకులు దీపక్ బొరివలిలోని తన ఇంటికి వెళుతుండగా ఆయనను వెంబడించారు. కారులో వెనుకసీటులో కూర్చున్న దీపక్‌పై కాల్పులు జరపగా గ్లాస్ డోర్లు ధ్వంసమవడంతో పాటు ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల దర్యాప్తులో ఇద్దరు జూనియర్ ఇంజనీర్ల ప్లాన్ బహిర్గతం కావడంతో వారితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ అమిత్ సిన్హా, షూటర్ అజయ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.