ఓ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి రెండేండ్లలో రూ.10 లక్షలు గుంజిన మహిళ.. మరో కోటికి టెండర్..!
Crime News | సంపన్నులను గుర్తించి, వలపువల విసిరి ట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి డబ్బు గుంజే కిలాడీ లేడీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ మధ్య కాలంలో
న్యూఢిల్లీ: సంపన్నులను గుర్తించి, వలపువల విసిరి ట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి డబ్బు గుంజే కిలాడీ లేడీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ మధ్య కాలంలో తరచుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర ఢిల్లీలోని ఖజూరిఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
ఓ 22 ఏండ్ల మహిళ ఢిల్లీకి చెందిన ఓ సంపన్నుడిని టార్గెట్ చేసి వలపు వల విసిరింది. ఆమె బుట్టలోపడ్డ ఆ వ్యక్తితో రాసలీలలు నడిపి వీడియోలు తీసుకుంది. తర్వాత ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని డబ్బు గుంజడం మొదలుపెట్టింది. ఇలా 2020 నుంచి ఇప్పటివరకు అతని దగ్గరి నుంచి ఏకంగా రూ.10 లక్షలు వసూలు చేసింది.
అయినా ఆ యువతిలో ధనదాహం చల్లారలేదు. ఇటీవల మరో వ్యక్తిని వెంట తీసుకెళ్లి బాధితుడిని బెదిరించింది. అతని నుంచి బలవంతంగా కోటి రూపాయలకు చెక్ రాయించుకుని ఉడాయించింది. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు వెస్ట్ కరవాల్ నగర్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

