ఖమ్మం :తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు ఎయిర్ గన్‌తో బెదిరించిన సంఘటనలో ముగ్గురు నిందితులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లోని బన్నికట్ గ్రామానికి చెందిన బొహర తేజ్ బహుదూర్ ఖమ్మం మయూరి సెంటర్ సమీపంలో పాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ తన కుంటుంబ సభ్యులతో వీడివోస్ కాలనీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే తేజ్ బహుదూర్ నుంచి స్వగ్రామానికి చెందిన సమీప బంధువు రామచంద్ర బొహరా 2014లో నాలుగు లక్షల రూపాలయలు అప్పుగా తీసుకున్నాడు.
ఏడేైళ్లెనా తిరగి చెల్లించకుండా ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నెల7వ తేదీన రామచంద్రబెహరా మరో ఇద్దరు కలిసి వీడివోస్ కాలనీలో నివాసం ఉంటున్నతేజ్ బహదూర్ ఇంటికి రాత్రి 12.30 గంటల సమయంలో ఎయిర్ గన్ చూపించి ఇచ్చిన డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరించారు. ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టి శనివారం ఉదయం న్యూ బస్‌స్టాండ్ సమీపంలో తిరుగుతున్న సురేష బొహరా, రామచంద్ర బొహర, సనిల్ బొహర తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్ వివరించారు.
నిందితులు ఇద్దరూ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారని వారిలో సురేష్ బొహరా మాత్రం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని కరుణగిరి సమీపంలో పాస్ట్ ఫుడ్ మాస్టర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.