–ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
బండ్లగూడ:అల్మారా లాకర్లో ఉంచిన బంగారు ఆభరణాలను దొంగతనం చేసిన నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.నిందితుడి నుంచి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఇన్స్పెక్టర్ రాజేందర్‌గౌడ్, క్రైం ఎస్ఐ ఎం.కుమార్గౌడ్లతో కలిసి వివరాలను వెల్లడించారు.
వట్టేపల్లి సైఫీ కాలనీలో నివసించే ఫర్హీన్ బేగం(20) జూలై 12న లంగర్‌హౌస్ రింగ్‌రోడ్ సమీపంలో ఉన్న మైత్రి ఆస్పత్రికి వెళ్లింది. జూలై 18న రాత్రి ఇంట్లో అల్మారా లాకర్ తెరచి చూడగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు గ్రహించిన ఆమె వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి కేసు విచారిస్తున్న పోలీసులు మంగళవారం రాత్రి ఈ దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించారు. బుధవారం ఉదయం అతడిని పట్టుకున్నారు. వట్టేపల్లి నూర్కాలనీలో నివసించే అంజద్ ఖాన్(32) ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు.అతడి వద్ద నుంచి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.