విషాదం.. సాయంత్రం కూతురి పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
సాయంత్రం కూతురి వివాహం | సాయంత్రం కూతురు వివాహం జరగాల్సి ఉండగా ఉదయం తండ్రి మరణించిన సంఘటన జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది.

బీర్కూర్/ కామారెడ్డి : తన బిడ్డల పెండ్లి కోసం ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. దేశం కాని దేశం వెళ్లి పైసా పైసా కూడబెట్టి బిడ్డ పెండ్లి ఘనంగా చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నాడు. బిడ్డను అత్తరింటికి సగర్వంగా సాగనంపి తన బరువును తీర్చాలకున్నాడు. కానీ, విధి మరోలా తలిచింది. ఎంతో సందడిగా వివాహం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. కూతురి పెండ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సాయంత్రం కూతురు వివాహం జరగాల్సి ఉండగా ఉదయం తండ్రి మరణించిన సంఘటన జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది.
గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ గూడుమియా (50)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆయన మొదటి కుమార్తె తబస్సుం. ఆమెకు బాన్సువాడ మండలం దేశాయిపేట్‌కు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. వివాహం సోమవారం సాయంత్రం జరగాల్సి ఉంది. కాగా, గత నెల 29వ తేదీన గూడుమియాకు బీపీ ఎక్కువై అస్వస్థకు గురయ్యాడు.
దీంతో ఆయనను బాన్సువాడ ఏరియా దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
గూడుమియా ఉపాధి కోసం 14 ఏండ్లు దుబాయ్‌లో ఉండి రెండేండ్ల క్రితమే వచ్చాడని, కుమార్తె పెండ్లి చేసి మళ్లీ దుబాయ్ వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పేవాడని గ్రామస్తులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్‌గా మారనున్న మహబూబ్‌నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

