e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News దారుణం : ద‌ళిత బాలిక‌ను అప‌హ‌రించి ఆపై సామూహిక లైంగిక దాడి!

దారుణం : ద‌ళిత బాలిక‌ను అప‌హ‌రించి ఆపై సామూహిక లైంగిక దాడి!

ల‌క్నో: యూపీలోని రాంపూర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ద‌ళిత బాలిక‌ను ఐదుగురు వ్య‌క్తులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఆదివారం రాత్రి బాలిక త‌న ఇంటి వ‌రండాలో నిద్రిస్తుండ‌గా కిడ్నాప్ చేసిన స్ధానిక యువ‌కులు నిందితుల్లో ఒక‌రికి చెందిన‌ షాపున‌కు తీసుకువెళ్లి ఈ అకృత్యానికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలి తండ్రి తెలిపారు. ఆ స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు పై అంత‌స్తులో పడుకుని ఉన్నార‌ని చెప్పారు.

బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డిన అనంత‌రం ఆమెను త‌మ ఇంటి స‌మీపంలో విడిచిపెట్టి వెళ్లార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల‌ను వ‌సీం, న‌జీబ్‌, ష‌ఫీక్, స‌నిబ్‌, న‌జీంలుగా గుర్తించారు. నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మ‌రం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement