కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్‌క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివరకు మోసపోయానని గమనించి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్‌లోని ఎంఎన్‌రెడ్డి నగర్ కాలనీకి చెందిన డి.బాలరాజు(34) వృత్తిరీత్య ఎక్సలెన్సీ అకాడమిలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.
కాగా తన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ఫోన్లో లక్కీ స్టార్ యాప్ ను ఇన్స్టాల్ చేయడంతో అందుకు రూ.10 వేల రూపాయలను మెయింటెన్ చేయాలని సూచించారు. పలు దఫాలుగా తన ఖాతాలో ఉన్న రూ.54,411 మాయమైన్నట్లు సందేశాలు వచ్చాయి. దీంతో చివరకు తాను మోసపోయానని గమనించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.