హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో రూ 3.6 కోట్ల విలువైన డ్రగ్స స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు సుడాన్ జాతీయులను రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు 7.3 కిలోల గోల్డ్ పేస్ట్‌ను తమ ప్రైవేట్ భాగాల్లో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు.
కస్టమ్స్ చెకింగ్ ప్రాంతంలో అధికారులు నలుగురు అనుమానితులను తనిఖీ చేయగా ఈ ఘటన వెలుగుచూసింది. మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేయగా వీరు తమ శరీర భాగాల్లో అనుమానిత పదార్ధాలను దాచినట్టుగా అధికారులు గుర్తించారు. ఇద్దరు మహిళలు సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరోవైపు ఇదే తరహాలో ప్రైవేట్ భాగాల్లో రూ 1.52 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్న 8 మంది మహిళలతో పాటు ఇద్దరు వ్యక్తులను గత నెల 22న బెంగళారులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. శ్రీలంక ఎయిర్వేస్కు చెందిన విమానంలో అనుమానితులు బెంగళూర్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు స్కెచ్ వేసినట్టు అధికారులు గుర్తించారు.