ముంబై: పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై వారు దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్నేర్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని చెదరగొట్టేందుకు వెళ్లిన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని వారు వెంబడించి దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురితో సహా పలువురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
#WATCH | Maharashtra: A crowd in Sangamner of Ahmednagar district attacks and chases State Reserve Police Force personnel who had gone to disperse the huge assembly of people. FIR registered against several people, including 5 named accused. The accused are currently absconding. pic.twitter.com/6zGMtQ1Qtn
— ANI (@ANI) May 7, 2021