వలిగొండ : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్నెపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి (24) అనే యువకుడు ఇంట్లో ఎవరులేని సమయంలో దూళానికి ఉరేసుకొని మృతి చెందాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం బావి దగ్గరకు వెల్లివచ్చే సరికి దూళానికి వేలాడుతూ ఉన్న కూమరున్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామ నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తలించారు. మృతుడి తండ్రి నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.