షాబాద్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని అస్పల్లిగూడ గేటు సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ నుంచి అస్పల్లిగూడకు వెళ్లే మార్గంలో దారి పక్కనే గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. గమనించిన చుట్టుపక్కల పొలాల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు.