తాండూరు రూరల్ : రెండు లారీలు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న సంఘటన కరణ్‌కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కోటబాసుపల్లి గ్రామ సమీపంలో చించోలి వైపు నుంచి తాండూరు వెళుతున్న ఓ లారీ తాండూరు వైపు నుంచి వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీలోని ఓ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఓ లారీ ముందు భాగం ధ్వంసమైంది.