ఒక హౌసింగ్ సొసైటీలో ఇంటి పని చేసే మహిళపై సెక్యూరిటీ గార్డు అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం సదరు మహిళ కుటుంబంలోని ఒక 23 ఏళ్ల యువకుడికి తెలిసింది. అతనికి ఆమె ఆంటీ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న అతను తన ఆంటీ పనిచేస్తున్న హౌసింగ్ సొసైటీకి వెళ్లాడు.
అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన ముంబైలోని పోవైలో ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. ఈ నెల 23న సదరు సెక్యూరిటీ గార్డుపై యువకుడు దాడి చేశాడు. అయితే అతని ఆంటీపై అసభ్య కామెంట్లు చేసిన వ్యక్తి యువకుడు దాడి చేసిన గార్డు వేరు అని తెలిసింది.
ఈ దాడిలో గాయపడిన సెక్యూరిటీ గార్డు ఆస్పత్రిలో మృతి చెందాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అలాగే మహిళపై అసభ్య కామెంట్లు చేసిన మరో సెక్యూరిటీ గార్డుపై మోలెస్టేషన్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.