
హైదరాబాద్: మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవలో ఒర వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాజులరామారంలోని ఒక మద్యం దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఇద్దరు కూలీల మధ్య మొబైల్ ఫోన్ విషయమైన గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో భూక్యా భీమా (45) అనే వ్యక్తిపై మరో కూలీ దాడి చేశాడు.
బండరాయితో బలంగా కొట్టడంతో భీమా మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన గొడవలోనే ఈ హత్య జరిగినట్లు జగద్గిరిగుట్ట పోలీసులు భావిస్తున్నారు.