హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తాజాగా ఒక అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్టయింది. వీరి వద్ద నుంచి 1.05 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు.
ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.12 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కాగా, ఇటీవలే ముంబైకి చెందిన ప్రముఖ డ్రగ్ డీలర్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కొన్నిరోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.