కామారెడ్డి: స్నేహితుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు అవడం సహజమే. కానీ వాళ్లు మత్తులో ఉంటే మాత్రం పరిస్థితి చేతులు దాటిపోతుంది. తాజాగా కామారెడ్డిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ స్థానికంగా ఉండే ఆరుగురు స్నేహితులు ఒకరిపై ఒకరు తీవ్రమైన దాడులకు తెగబడ్డారు.
మొబైల్ ఫోన్ విషయంలో వీరికి మాటా మాటా పెరిగిందని, దీంతోనే గొడవ పడ్డారని తెలుస్తోంది. ఈ ఘర్షణలో మిత్రులు తమ చేతికి దొరికిన రాళ్లు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో వీరిలో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి.
పరిస్థితిని గమనించి స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. స్నేహితులంతా కలిసి గంజాయి తీసుకున్నారని, ఆ మత్తులోనే ఇలా కొట్టుకున్నారని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.