ముంబై: మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.