Crime News | పెళ్లిలో పాటల గురించి గొడవ.. బంధువును కాల్చి చంపిన వరుడు!
ఇటీవలి కాలంలో ఎక్కడ పెళ్లి జరిగినా డీజే దరువు ఉండాల్సిందే. మనసుకు నచ్చిన పాపులర్ పాటలు డీజే సౌండ్‌లో వింటూ పెళ్లి సంబరాల్లో డ్యాన్సులు చేయడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా పెళ్లిలో పాటలు పెట్టడమే ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌లో వెలుగు చూసింది.
స్థానిక షాపూర్ ప్రాంతంలో ఇఫ్తికార్ అనే యువకుడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో డీజే పెట్టిన పాటల విషయంలో వరుడు.. అమ్మాయి తరఫు బంధువైన జాఫర్ అలీతో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారడంతో.. ఇఫ్తికార్ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకొచ్చి జాఫర్ అలీని షూట్ చేసేశాడు.
దీంతో భయభ్రాంతులకు గురైన మిగతా బంధువులు.. హుటాహుటిన జాఫర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతను మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇఫ్తికార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముజఫ్ఫర్‌పూర్‌లో సెక్యూరిటీ బాగా టైట్ చేశామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

